CTR: పులిచెర్ల మండలం చల్లావారిపల్లి పంచాయతీలోని శ్రీనివాసపురంలో గిరిజన వికాసం కార్యక్రమం మంగళవారం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో రాజశేఖర్ బాబు తెలిపారు. గిరిజన ప్రజలకు వైద్య పరీక్షలు, పౌరహక్కులు, స్కిల్ డెవలప్మెంట్పై అవగాహన సదస్సు జరుగుతుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.