ఆరావళి పర్వత శ్రేణుల విషయంలో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశానికి సంబంధించి ఇవ్వాల్సిన ఆర్డర్‌ను అత్యున్నత న్యాయస్థానం పెండింగ్‌లో పెట్టింది. ఇదే సమయంలో ఈ వ్యవహారంపై పూర్తి వివరణ ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కేంద్రం ఇచ్చే సమాధానం ఆధారంగానే ఈ కేసులో తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉంది.