AKP: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 31న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని నాతవరం ఎంపీడీఓ ఎంఎస్.శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. మండలంలో మొత్తం 10986 మంది పింఛన్ దారులు ఉన్నారన్నారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సచివాలయ సిబ్బందిని ఆదేశించామన్నారు.