VZM: PGRS లో భాగంగా ఇవాళ జిల్లాలో రెవెన్యూ క్లినిక్స్ ప్రారంభించినట్లు కలెక్టర్ S.రాంసుందర్ రెడ్డి తెలిపారు. రికార్డుల ఆధారంగా ఎక్కడికక్కడే ఫిర్యాదులకు సమాచారం అందిస్తామన్నారు. అన్ని పిటిషన్లను డేటాబేస్‌లో నమోదు చేసి వారానికోసారి సమీక్ష నిర్వహిస్తామన్నారు. గత నెలల్లో గ్రీవెన్స్‌లో సంతృప్తి ర్యాంకింగ్‌తో మెరుగైన స్దానం లభించిందన్నారు.