ADB: తాంసి మండలం సర్పంచ్ల సంఘం నూతన అధ్యక్షునిగా గండ్రత్ అరుణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని సర్పంచ్ల సమావేశంలో ఎన్నుకున్నారు. సంఘం ఉపాధ్యక్షునిగా బెండ జయ సుధ, ప్రధాన కార్యదర్శిగా మతిన్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారిని శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.