ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయంపై స్టే విధించింది. అనంతరం కుల్దీప్ సింగ్ సెంగార్‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో రిప్లై ఇవ్వాలని ఆదేశించింది. కుల్దీప్కు హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంను ఆశ్రయించిన నేపథ్యంలో ఈ విధంగా తీర్పునిచ్చింది.