MBNR: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ అభివృద్ధిపై మార్కెట్ కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని కలిసి చర్చించారు. ఛైర్పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి ఆధ్వర్యంలో పలు సమస్యలు విన్నవించారు. మార్కెట్ ఆధునీకరణకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ రాజేందర్ గౌడ్, డైరెక్టర్లు కాజా బాషా, కొంగల్ యాదయ్య పాల్గొన్నారు.