TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు తిరుమలకు వెళ్లనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు. అయితే, ఇవాళ అర్ధరాత్రి నుంచే తిరుమలలో ఉత్తర ద్వారా దర్శనాలు ప్రారంభం కానున్నాయి. లక్షలాది మంది భక్తులు రానుండటంతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.