MNCL: బెల్లంపల్లి మండలంలో పెద్దపులి సంచారం మండల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. బుగ్గ అటవీ ప్రాంతంలో స్థానిక యువకులకు పెద్దపులి కనిపించినట్లుగా వారు తెలిపారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సోమవారం పాదముద్రలను గుర్తించారు. చంద్రవెల్లి అటవీ ప్రాంతంలో కూడ అటవీశాఖ అధికారులు పాదముద్రలను గుర్తించినట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.