MNCL: గురుకుల విద్యాలయాల్లో 2026-27 విద్య సంవత్సరానికి 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు TG సెట్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కాసిపేట్ గురుకుల ప్రిన్సిపాల్ సంతోష్ కుమార్ సోమవారం ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు జనవరి 21వ తేదీ వరకు ఆన్లైన్లో ఫీజు రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 22న జరుగుతుందని వెల్లడించారు.