GNTR: తెనాలి పురపాలక సంఘ సాధారణ సమావేశం ఈ నెల 31వ తేదీ బుధవారం జరగనుంది. స్థానిక కౌన్సిల్ హాలులో ఉదయం 11:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో, పట్టణ అభివృద్ధికి సంబంధించిన 22 అజెండా అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ మేరకు ఛైర్పర్సన్ తాడిబోయిన రాధిక సోమవారం ప్రకటన విడుదల చేస్తూ, కౌన్సిల్ సభ్యులందరూ ఈ సమావేశానికి హాజరుకావాలని కోరారు.