MDK: మనోహరాబాద్ మండలం రంగాయపల్లికి చెందిన తాపీ మేస్త్రి రాజమైన శ్రీనివాస్ (45) మృతిచెందాడు. తాపీ పనితో పాటు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆయన, రాత్రి సమీపంలోని తల్లి ఇంట్లోనే నిద్రించినట్లు సమాచారం. అర్ధరాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన చెట్ల గౌరారం శివారులోని అటవీ ప్రాంతంలో ఉరేసుకుని మృతిచెందినట్లు గుర్తించారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు.