MBNR: జిల్లా కేంద్రంలోని బీసీ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేస్తూ, హాస్టళ్లలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. పడుకోవడానికి సరైన స్థలం, తగిన బాత్ రూమ్లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.