AP: రాష్ట్రంలో కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 28కి చేరుకోనున్నాయి. ఎల్లుండి తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. గూడూరును తిరుపతి నుంచి నెల్లూరులో కలిపేందుకు, కొత్తగా 5 డివిజన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించింది.