GNTR: కొల్లిపర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ నిల్వలు సిద్ధంగా ఉన్నాయని సీఈవో నాగిరెడ్డి సుమాక్ సోమవారం తెలిపారు. జొన్న, మొక్కజొన్న సాగు చేసే రైతులు ఒక్కో ఆధార్ కార్డుపై నాలుగు బస్తాల యూరియా, నాలుగు బస్తాల డీఏపీ పొందవచ్చని పేర్కొన్నారు. మండల పరిధిలోని రైతులు ఆధార్ కార్డుతో వచ్చి ఎరువులు తీసుకోవాలని కోరారు.