కేరళలోని కొచ్చిలో అద్భుత దృశ్యం కనువిందు చేసింది. అక్కడి వెలి గ్రౌండ్స్‌లో ఉన్న 200 ఏళ్ల నాటి భారీ వృక్షాన్ని క్రిస్మస్ సందర్భంగా రంగురంగుల లైట్లతో ముస్తాబు చేశారు. సుమారు 80 అడుగుల ఎత్తు ఉండే ఈ చెట్టు.. రాత్రి వేళ విద్యుత్ కాంతుల్లో మెరుస్తూ చూపరులను కట్టిపడేస్తోంది. తాతల కాలం నాటి ఈ చెట్టుకు వచ్చిన కొత్త అందాన్ని చూసేందుకు స్థానికులు, పర్యాటకులు భారీగా తరలివచ్చారు.