ELR: జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను రాష్ట్ర ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ స్థానిక పార్టీ కార్యాలయంలో కలిసి ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.