MNCL: ప్రభుత్వం బీసీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని సోమవారం జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ.. బీసీ ఫెడరేషన్లకు పాలక మండల్లు ఏర్పాటుచేసి నిధులు విడుదల చేయాలని, ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు.