KNR: చిగురుమామిడి ఎస్సైగా దూలం పృథ్వీధర్ గౌడ్ బదిలీపై వస్తున్నట్లు పోలీస్ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. కరీంనగర్ సీసీఆర్బీలో విధులు నిర్వహించి బదిలీపై చిగురుమామిడికి, ఇక్కడ పనిచేసిన ఆర్.సాయికృష్ణ మానకొండూర్ మండలానికి బదిలీపైవెళ్తున్నారు. అతితక్కువ కాలం చిగురుమామిడి మండలంలో ఎస్సైగా పనిచేసిన సాయికృష్ణ శాంతి భద్రతల పరిరక్షణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.