MBNR: జడ్చర్లలోని చైతన్య నగర్‌కు చెందిన మాజీ ఎంపీటీసీ బాలరాజ్ యాదవ్ సోమవారం ఉదయం తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు . గతంలో ఆయన జడ్చర్ల పట్టణం నుంచి వరుసగా మూడుసార్లు ఎంపీటీసీగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. ఆయన మృతి విషయం తెలిసిన వెంటనే వివిధ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు బాలరాజ్ యాదవ్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.