MBNR: హైదరాబాద్లో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి, పలువురు ఆశా కార్యకర్తలను సోమవారం పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. అవి ‘చలో అసెంబ్లీ’లో పాల్గొంటారని సమాచారం అందడంతో తీసుకున్న చర్యలని పోలీసులు పేర్కొన్నారు. వారిని మహబూబ్నగర్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. కార్మిక సంఘాల నేతలు ఈ అరెస్టులను తీవ్రంగా ఖండించారు.