BHPL: గణపురం మండల కేంద్రంలోని గణపేశ్వరాలయంలో సోమవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు స్వామివారిని విశేషంగా అలంకరించి.. శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ఉదయం నుంచే అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని.. కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.