VZM: వేపాడ మండలం బల్లంకిలో వెటర్నరీ డాక్టర్ గాయత్రి ఆధ్వర్యంలో సోమవారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. 20 పశువులకు గర్భకోశ వ్యాధులు, 12 పశువులకు సాధారణ వ్యాధులకు చికిత్స అందజేసి, పెయ్యిలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. జీవాల యాజమాన్యం, పశుగ్రాసం పెంపకంపై పాడి రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక సహాయకులు పాల్గొన్నారు.