AP: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో మనసులను కలచివేసే ఘటన చోటుచేసుకుంది. ఓ గర్భిణీకి హిందూపురం ఆస్పత్రిలో ప్రసవం జరిగింది. అయితే, ప్రసవం తర్వాత ఆమెకు రక్తపోటు పెరగడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో బాలింత మరణించగా.. ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తరలిస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగి అప్పుడే పుట్టిన బిడ్డ కూడా మరణించింది.