AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ ప్రారంభమైంది. సమావేశంలో 21 అంశాలపై చర్చించారు. అమరావతి అభివృద్ధికి నాబార్డు నుంచి రూ.7,387 కోట్ల రుణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. వరల్డ్ బ్యాంకు, ADB నిధులతో ప్యాకేజీ పనులకు గ్రీన్ సిగ్నల్, అమరావతి ల్యాండ్ అలాట్మెంట్ కేసులపై, ఉద్యోగులకు DA పెంపు అమలు, గ్రామ, వార్డు సచివాలయాల పేర్ల మార్పుపై ఆర్డినెన్స్‌కు ఆమోదం లభించింది.