ATP: గుత్తి ఏపీ మోడల్ స్కూల్ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ సోమవారం కాలనీవాసులు మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియాకు వినతి పత్రం అందజేశారు. కాలనీ వాసులు విద్యాధర్, వాసు మాట్లాడుతూ.. కాలనీలో డ్రైనేజీ, వీధిలైట్లు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారులు స్పందించి కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.