W.G: ఆకివీడు మెయిన్ రోడ్డు నుంచి శ్మశాన వాటికకు వెళ్లే రహదారి నిర్మాణ పనులు సోమవారం పునఃప్రారంభమయ్యాయి. ప్రోటోకాల్ పాటించలేదనే కారణంతో మున్సిపల్ ఛైర్ పర్సన్ గతంలో ఈ పనులను నిలిపివేయగా, స్థానిక కూటమి నాయకులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు పనులను తిరిగి మొదలుపెట్టారు.