GDWL: అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా అక్రమంగా గృహ నిర్బంధం చేయడం ప్రభుత్వ పిరికిపంద చర్య అని గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బాసు హనుమంతు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్టీ పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి తలపెట్టనున్నారని పోలీసులకు ముందు సమాచారంతో ఆయనను నిర్బంధించారు.