SRD: వైద్య శాఖలో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మాజీ మంత్రి హరీష్ రావుకు హైదరాబాద్లో ఏఐటీయుసీ నాయకులు వినతి పత్రం సమర్పించారు. సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రెహమాన్ మాట్లాడుతూ.. సెకండ్ ఏఎన్ఎంల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించాలని మాజీ మంత్రిని కోరినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వెంకట రాజ్యం పాల్గొన్నారు.