NLR: సైదాపురం ST కాలనీ సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పులిగిలపాడు సమీపంలోని క్రషర్ నుంచి కంకర్ లోడుతో గూడూరు వైపు ఓ టిప్పర్ బయల్దేరింది. మార్గమధ్యలో టిప్పర్ అదుపు తప్పి దక్షేశ్ (5) పైకి దూసుకెళ్లింది. అతను తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.