TG: మన రాజకీయ నాయకుల వల్లే బయట కొందరు గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. ‘కొత్తగా ఎన్నికైన సభ్యులు గౌరవ మర్యాదలతో మాట్లాడాలి. ఫ్యూచర్లో సభకు వచ్చే సభ్యులకు మనం ఆదర్శంగా ఉండాలి. చాలా మంది సీఎం, మాజీ సీఎం, ప్రధాని పట్ల అగౌరవంగా మాట్లాడుతున్నారు. సభలో అర్థవంతమైన విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవాలి’ అని సూచించారు.