AP: విశాఖలోని వేలంపేటలో మంత్రి నారాయణ పర్యటించారు. పర్యటనలో భాగంగా పూర్ణా మార్కెట్ సమీపంలోని స్లమ్ ఏరియాలో నివసిస్తున్న వారి ఇళ్లకు ఆయన స్వయంగా వెళ్లారు. ఇంట్లో వారిని పలకరించి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నివాసితులు తమకు సరైన నివాసాలు లేవని మంత్రికి చెప్పగా.. మంత్రి సానుకూలంగా స్పందించారు. సీఎంతో చర్చించి వీలైనంత త్వరగా ప్రత్యేక ప్రాజెక్ట్ చేపడతామన్నారు.