BDK: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం ఉదయం 10:30 గంటలకు గిరిజన దర్బార్ నిర్వహించనున్నట్లు ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ తెలిపారు. గిరిజనులు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలతో హాజరుకావాలని కోరారు.దర్బార్‌కు అన్ని శాఖల యూనిట్ అధికారులు సకాలంలో హాజరై ఫిర్యాదులను స్వీకరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా గిరిజన ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.