HYD: దక్షిణ మధ్య రైల్వే జనవరి 1 నుంచి కొత్త టైంటేబుల్ అమలు చేయనుంది. ఈ నేపథ్యంలో వందేభారత్ సహా మొత్తం 25 రైళ్ల సమయాల్లో మార్పులు జరిగాయి. ముఖ్యంగా సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ (20707) ఉ. 5:05కు బదులు 5 గంటలకే బయల్దేరుతుంది. అలాగే, కాకతీయ ఎక్స్ప్రెస్ (17659) కూడా 5:25కు బదులు 5 గంటలకే సికింద్రాబాద్ నుంచి భద్రాచలానికి ప్రయాణం ప్రారంభించనుంది.