TG: HYD రవీంద్రభారతిలో ఇవాళ ‘బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్-2025’ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ మేరకు TFDC ఛైర్మన్ దిల్ రాజు ప్రకటనలో తెలిపారు. బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై షార్ట్ ఫిల్మ్స్తోపాటు, పాటలను ఆహ్వానించారు. ఇవాళ ఉత్తమ షార్ట్ ఫిల్మ్, పాటలను ఎంపిక చేసి నగదు పురస్కారాలతోపాటు సర్టిఫికెట్లు అందజేస్తారు.