NLG: ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి సంక్షేమ పథకం ఫలాలను గ్రామస్తులకు అందించడమే తన ధ్యేయమని చిట్యాల మండలం ఆరెగూడెం సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్ అన్నారు. సోమవారం గ్రామంలోని మహిళలకు ఇందిరా మహిళ శక్తి చీరలను పంపిణీ చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జంజు రాజు, వార్డు సభ్యులు రాచమల్ల మహేష్, అనిత, నందిపాటి శ్రీనివాస్, వల్లందాసు కవిత పాల్గొన్నారు.