SKLM: కొత్తూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 28 మినీ అంగన్వాడీ కార్యకర్తలను మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా అప్గ్రేడ్ చేస్తూ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండర్కర్ ఉత్తర్వులను జారీ చేశారు. ఇందులో కొత్తూరు-14, హిరమండలం-11, ఎల్.ఎన్.పేట-3 మినీ అంగన్వాడీ కార్యకర్తలను అప్గ్రేడ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.