NLG: నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి (జీజీహెచ్) ఆవరణలో ఉన్న పట్టణ నిరాశ్రయుల వసతి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇవాళ తెల్లవారుజామున ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉ. 5గం.లకే ఆసుపత్రికి చేరుకున్న కలెక్టర్ వసతి కేంద్రంలో అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా డార్మెటరీలు ఏర్పాటు చేసినట్లు అధికారులు కలెక్టర్కు తెలిపారు.