AP: పలువురు యువతుల సహకారంతో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళను మాచవరం పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలోని మాచవరం శాంతినగర్‌కు చెందన వేముల రమణమ్మ తాను ఉంటున్న అద్దె ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తోంది. నివాసాల మధ్య జరుగుతున్న ఈ వ్యవహరంపై పోలీసులు దాడులు నిర్వహించి ముగ్గురు యువతులతో పాటు రాజు అనే విటుడిని అదుపులోకి తీసుకున్నారు.