WNP: హైదరాబాద్లో నిన్న జరిగిన తెలంగాణ అండర్-15 బాలికల క్రికెట్ విభాగంలో ఏదుల మండల కేంద్రానికి చెందిన బాలిక మేఘన రాష్ట్ర జట్టుకు ఎంపికైంది. జనవరి 2 నుంచి బీసీసీఐ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జరిగే జాతీయస్థాయి క్రికెట్ పోటీల్లో ఆమె పాల్గొననుంది. మేఘన రాష్ట్ర జట్టుకు ఎంపిక కావడంపై తల్లిదండ్రులు రాణి, బాలరాజ్ గౌడ్, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.