MLG: ములుగు మండలం జాకారం గ్రామ ఉప సర్పంచ్‌గా నూతనంగా ఎన్నికైన బొట్ల కార్తీక్‌ను ఇవాళ స్వేరోస్ నాయకులు శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్వేరోస్ నాయకులు మాట్లాడుతూ.. స్వేరోస్ కార్యకర్తగా సేవలందించి ప్రజాప్రతినిధిగా ఎదగడం గర్వకారణమని వారు పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధిలో చురుకైన పాత్ర పోషించాలని సూచించారు. కార్యక్రమంలో స్వేరోస్ నేతలు ఉన్నారు.