విశాఖ: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ముస్తాబు” కార్యక్రమంలో భాగంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు ముస్తాబు కిట్లను సోమవారం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పంపిణీ చేశారు. జిల్లాలోని 23 వసతి గృహాలకు అవసరమైన కిట్లను బాదిరెడ్డి సూర్య ప్రకాష్ అందించారు. పరిశుభ్రత పాటిస్తే ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని కలెక్టర్ తెలిపారు.