WGL: పర్వతగిరి మండల కేంద్రంలో విద్యార్థులు సోమవారం పర్యావరణ పరిరక్షణపై గ్రామస్తులకు విద్యార్థులు అవగాహన కల్పించారు. సేంద్రియ వ్యవసాయం, చెట్ల సంరక్షణ, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరంపై ప్రజలకు వివరించారు. గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని వారు పిలుపునిచ్చారు. గ్రామ సర్పంచ్ చిదురు శంకర్, ఏఎస్సై మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.