MBNR: ప్రజా సమస్యల సత్వర పరిష్కార లక్ష్యంతో మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి. జానకి 15 మంది ఫిర్యాదుదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సమస్యలను శ్రద్ధగా విని, పారదర్శకంగా విచారించి చట్ట ప్రకారం త్వరిత పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు.