VZM: నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ఆధ్వర్యంలో పల్లె పండగ 2.0గా భాగంగా గ్రామీణ యువతను ప్రోత్సహిస్తూ జనవరి 2 నుండి 13 తేది వరకు క్రీడా-సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నారు. ముంజేరు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆమె మాట్లాడుతూ.. పూసపాటిరేగ, SMS కంపెనీ ఎదురుగా పోటీలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు కోట్ల రఘు పాల్గొన్నారు.