MHBD: కొత్తగూడ మండలం గుడితండ, లక్ష్మీపురం గ్రామంలోని ప్రజలకు డీఎస్పీ తిరుపతి రావు, సీఐ సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో రాబిన్ హుడ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో నిత్యవసర వస్తువులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా SI రాజు కుమార్ మాట్లాడుతూ.. చలికాలంలో పేదలు ఇబ్బందులు పడకుండా ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. పోలీస్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఉన్నారు.