SS: కదిరిలో జరుగుతున్న తబ్లిగ్ ఇస్తెమాకు దూర ప్రాంతాల నుంచి వచ్చే ముస్లిం సోదరుల సౌకర్యార్థం ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ రెండు ఉచిత బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు ఇబ్బంది పడకుండా నేరుగా ఇస్తెమా ప్రాంగణానికి చేరుకునేలా ఈ సదుపాయం కల్పించామన్నారు. ఎమ్మెల్యే తీసుకున్న ఈ నిర్ణయంపై ముస్లిం పెద్దలు, సోదరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.