మహబూబ్నగర్ టౌన్ రజక సంఘం నూతన కమిటీని సోమవారం ఏర్పాటు చేసుకున్నట్లు అధ్యక్షులు దుర్గేష్ వెల్లడించారు. పట్టణంలోని పద్మావతి కాలనీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రజకుల సమస్యల పరిష్కారానికి నూతన కమిటీ పని చేస్తుందన్నారు. గౌరవ అధ్యక్షులుగా పాండు, బుచ్చన్న, నాగరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్గా బాలరాజు, ఉపాధ్యక్షులుగా సాయిలు, నరసింహులు, శారద ఎన్నికయ్యారు.