TG: హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో ‘X’ వేదికగా ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ పోస్ట్ పెట్టారు. దానికి KCRతో దిగిన ఫొటోను కూడా జత చేశారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు, KCR అభిమానులు వెల్కమ్ బాస్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సంతకం చేసి వెళ్లిన విషయం తెలిసిందే.