కృష్ణా: పెనమలూరు (M) కానూరు సనత్నగర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అమీదున్నిసా ప్రమాదానికి గురై మంచానికే పరిమితం కాగా, కుమార్తె నాగుల్బేగం సంరక్షణ చేపట్టింది. ఈనెల 27 రాత్రి కుమార్తె దోమల చక్రం వెలిగించి పక్క షాపుకు వెళ్లి తిరిగి వచ్చేసరికి చీరకు మంటలు అంటుకుని తీవ్రంగా కాలింది. బెజవాడ GGHకు తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది.